ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : మండలంలోని తీర్థం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న డాక్టర్ పద్మావతి ఆదేశాల మేరకు తీర్థం గ్రామంలోని జడ్పీ స్కూల్ నందు బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం అనే అంశం పై హెల్త్ ఎడ్యుకేటర్ ఏ.శ్రీదేవి మాట్లాడుతూ బాల్య వివాహలవలన శరీరకంగాను, మానసికంగాను, సామాజికంగాను ఆర్ధికంగాను నష్టాల గురించి తెలియజేయడం జరిగింది. బాలికలకు 21 బాలురుకు 25 సంవత్సరాలు నిండిన తరువాతనే వివాహం చేసుకోవాలని లేదంటే బాల్యవివాహాలు చేసినచో కఠినమైన శిక్షలు ఉంటాయని మరియు తల్లితండ్రులకు కూడా అలాంటి వివాహాలకు పాల్పడితే 2సం. శిక్ష పడుతుందని తెలియజేసి ఎవరికైన బాల్యవివాహం చేసినచో బాలికలు 1098 నెంబర్ కు కాల్ చేసిన ఆ వివాహం నుంచి తప్పించుకోవచ్చును. బాల్యవివాహాల వలన బాలికలకు గర్భవిచ్చితి, మరియు బరువు తక్కువ పిల్లలు పుడతారుని కొన్నిసార్లు మాతృ మరణం కూడ జరగవచ్చునని మరియు బాలికల ఆరోగ్యం తొందరగా పాడగునని తెలియజేయడం జరిగింది. హెల్త్ సూపర్వైసర్ P శ్రీదేవి, ఐ.సి.డి.ఎస్ సూపర్వైసర్ లత, ఏఎన్ఎం సూర్యకల, అంగన్వాడీ టీచర్స్, ఆశలు పాల్గొన్నవారు.










