ప్రజాశక్తి-వీ.కోట : మండలంలో బంగాళాదుంప సాగు చేస్తున్న రైతులకు స్థానిక ఉద్యాన అధికారి లక్ష్మీ ప్రసూన క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు పలు సూచనలు మెలుకు వలుతెలియజేశారు. బుధవారం మండలంలోని కరిప్పల్లి పెద్దబరినెపల్లి గ్రామాలలో సాగు చేస్తున్న బంగాళాదుంప పంటను పరిశీలించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా బంగాళాదుంపలో చేపట్టవలసిన సస్యరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు.బంగాళాదుంప పంటలో ఆకుమాడు తెగులును గుర్తించి దానికి నివారణ పద్ధతులను రైతులకు వివరించారు. ఈ తెగులు ఆశించినప్పుడు మొదటగా మొక్కలపై పసుపు రంగు తరువాత గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమేనా మొక్కలు ఎండిపోతాయన్నారు. ఈ తెగులు కొమ్మలు దుంపలను కూడా ఆశించి పంట నష్టం కలిగిస్తుందని చల్లటి వాతావరణం ఉన్నప్పుడు పగటివేళ్లలో తెల్లటి శిలీంద్రం ఆకుల అడుగుభాగాన కనబడుతుందని తెలిపారు.










