Sep 13,2022 16:43

ప్రజాశక్తి-యదమరి : దోమల నివారణతోనే ప్రాణాంతక జ్వరాలకు చెక్ సి హెచ్ ఓ లక్ష్మీనారాయణ. దోమలు పుట్టకుండా కుట్టకుండా చర్యలు తీసుకుంటే ప్రాణాంతక జ్వరాల బారి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చని యాదమరి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం యాదమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జంగాలపల్లి గ్రామంలో క్షేత్ర స్థాయి సిబ్బంది చేపట్టిన జ్వరాల సర్వేను సిహెచ్ఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తుల ఉద్దేశించి మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే అంటువ్యాధుల భారి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు అన్నారు. దోమలు వృద్ధి చెందకుండా నివాస గృహాల పరిసరాల్లో నిరుపయోగంగా ఉన్న రుబ్బురోలు కొబ్బరి చిప్పలు పాత టైర్లు పేడ దిబ్బలు లాంటివి నివాస గృహాలకు దూరంగా వేయాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని ఇలాంటి చర్యలు తీసుకోవడం వలన దోమలను అరికట్టవచ్చు అన్నారు. దోమలు ప్రబలితే డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా లాంటి ప్రాణాంతక జ్వరాల బారిన పడక తప్పదని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ వారి నివాస గృహాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ సూచించారు. ఈ కార్యక్రమంలో మెయిల్ హెల్త్ అసిస్టెంట్  సురేందర్ రెడ్డి, ప్రసన్న లోకేశ్వరి ఆశ వర్కర్లు గజలక్ష్మి, సునీత, లీలావతి పాల్గొన్నారు.