ఆవుపై చిరుత దాడి
ప్రజాశక్తి- కుప్పం: కుప్పం మండలం కష్ణాపురం గ్రామం అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తోంది. మంగళవారం సాయంత్రం చిరుత ఓ పాడి ఆవుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గ్రామానికి చెందిన వచప్పా మురుగన్‌కి చెందిన 70 ఆవులు అటవీ ప్రాంతానికి మేత కోసం ప్రతిరోజు వెళుతుంటాయి. ఈ గోవులను జల్లికట్టు కోసం, పాల విక్రయం కోసం అమ్మడానికి పెంచుతున్నట్లు తెలిపారు. అటవీశాఖ అధికారులు దీనిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలంటూ కోరుతున్నారు.










