రహదారిని పరిశీలిస్తున్న డిఐజి అమ్మిరెడ్డి
ప్రజాశక్తి-అనంతపురం క్రైం అవసరమైన చోట లైటింగ్ పెంచి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డి ఆదేశించారు. శుక్రవారం స్థానిక తపోవనం సర్కిల్ నుంచి నేషనల్ పార్కుకి వెళ్లే రహదారిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాఉతూ రోడ్డుకు ఇరువైపులా పొదలను తొలగించాలన్నారు. ముఖ్యంగా చీకటిగా ఉన్న చోట లైటింగ్ మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా రాంగ్ రూట్లో వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించడంతోపాటు ప్రమాదాల నియంత్రణకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ వెంకటేష్‌నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.










