Oct 12,2023 17:25

వాల్‌పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న వైద్యులు

ప్రజాశక్తి -నెల్లూరు :ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం సందర్భంగా నారాయణ హాస్పిటల్‌ ఆర్థోపెడిక్స్‌ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా నారాయణ హాస్పిటల్‌ ఆర్థోపెడిక్స్‌ వైద్యులు డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ అర్షద్‌ మాట్లాడుతూ ఆర్థరైటిస్‌ అంటే కీళ్లు వాటి కణజాలానికి సంబంధించిన సమస్య అన్నారు. ఇందులో చాలా రకాల వ్యాధులు ఉన్నాయన్నారు. అందులో ముఖ్య మైనవి ఆస్టియో ఆర్థరైటిస్‌, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, స్పాండైలో ఆర్థరైటిస్‌, గౌట్‌, పిల్లల్లో వచ్చే ఆర్థరైటిస్‌ ఇలా రకరకాల ఆర్థరైటిస్లు ఉన్నాయన్నారు. ప్రస్తుతం జీవనశైలి మార్పులతో ఈ ఆర్థరైటిస్‌ వ్యాధి అన్ని వయసుల వారిని తీవ్రంగా వేధిస్తుందన్నారు. నారాయణ హాస్పిటల్‌ ఆర్థోపెడిక్స్‌ విభాగాధిపతి డాక్టర్‌ బిజురవీంధ్రన్‌ మాట్లాడుతూ ఆర్థరైటిసిని సరైన సమయంలో గుర్తించి తొలిదశలో చికిత్స అందిం చకపోతే ముఖ్యమైన కీళ్లు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. లాగే కొన్ని సందర్భాలలో శస్త్రచికిత్స కూడా చేయాల్సి వస్తుందని, వీలైనంత వరకూ వైద్యుల సలహాలు పాటించడం వల్ల వ్యాధి తీవ్రత ఏ దశలో ఉందో గుర్తించవచ్చన్నారు. కీళ్ల వ్యాధిని అరికట్టేందుకు, కీళ్ల వ్యాధికి చికిత్సలు అందజేసేం దుకు ఒక ప్రత్యేక బందాన్ని నారాయణ హాస్పిటల్‌ ఆర్థోపెడిక్స్‌ విభాగం అందుబాటులోకి తీసుకొచ్చా మన్నారు. నారాయణ హాస్పిటల్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి. హరిప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని 12-10-2023 నుంచి 12-11-2023 వరకు నెల రోజుల పాటు రాయితీలతో కూడిన చికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వైద్యులు సూచించిన వారికి రూ. 1200/- ఖరీదై న వైద్య పరీక్షలు రూ? 499/-లకే అందిస్తామని తెలిపారు. వివరాలకు 7331170063/ 9177004528 నెంబర్లకు సంప్రదిం చాలని కోరారు. నారాయణ హాస్పిటల్‌ అసిస్టెంట్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుప్రజ, జాయింట్‌ రీప్లేస్మెంట్‌ సర్జన్లు డాక్టర్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి, డాక్టర్‌ హరికష్ణారెడ్డి, హాస్పిటల్‌ ఏజీఎం ఎ.సి శేఖర్‌ రెడ్డి ఉన్నారు.