Jul 20,2022 22:22

అవగాహనతో కేన్సర్‌ దూరం
పింక్‌ బస్సు సేవలను ప్రారంభిస్తున్న ఎంపీపీ
ప్రజాశక్తి- కార్వేటినగరం

అవగాహనతోనే కేన్సర్‌ వ్యాధిని దూరం చేయవచ్చుని ఎంపిపి లత బాలాజీ అన్నారు. బుధవారం రాస్‌ మహిళా పొదుపు సంఘాల సౌకర్యార్థం మండల కేంద్రంలోని రాస్‌ వృద్ధాశ్రమం వద్ద టాటా ట్రస్టు సహకారంతో కేన్సర్‌ వ్యాధికి ఉచిత వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్యశిబిరానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన ఎంపిపి రెడ్‌ బస్సు సేవలను ప్రారంభించారు. అనంతరం ఎంపిపి మాట్లాడుతూ టాటా ట్రస్టు వారి చేపడుతున్న పింక్‌ బస్సు ఉచిత వైద్యసేవలను సద్వినియోగం చేసుకున్నట్లయితే మండలాన్ని కేన్సర్‌ రహిత మండలంగా తీర్చిదిద్దుకున్నట్లయితే మండలాన్ని కేన్సర్‌ రహిత మండలంగా తీర్చిదిద్దుకోవచ్చని పిలుపునిచ్చారు. వ్యాధి లక్షణాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం వల్ల ప్రారంభదశలోనే గుర్తించి నివారణకు చర్యలు తీసుకుని అరికట్టేందుకు అవకాశం ఉందన్నారు. అనంతరం వైద్యసిబ్బంది ఉచితంగా బీపీ, షుగర్‌, హైపటైటిస్‌ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అలాగే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వాడకం వల్ల ఏర్పడే అనార్థలను వివరించారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ గోపినాధ్‌, శ్రీకాంత్‌, మండల కోఆప్షన్‌ మెంబర్‌ పట్నం ప్రభాకర్‌రెడ్డి, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ బాల సుబ్రమణ్యరాజు, టాటా ట్రస్టు సిబ్బంది పాల్గొన్నారు.