Sep 14,2022 22:56

అవార్డు గ్రహీతలను అభినందించిన కలెక్టర్‌
ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌:

రాష్ట్రస్థాయి ఉత్తమఉపాధ్యాయ పురస్కార అవార్డు గ్రహీతలను జిల్లా కలెక్టర్‌ యం.హరి నారాయణన్‌ అభినందించారు. బుధవారం రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార అవార్డు గ్రహీతలైన చిత్తూరు పిసిఆర్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌లో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ ఎస్‌.మాధవిలత, పెనుమూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పనిచేసి రిటైర్డ్‌ అయిన మాథ్స్‌టీచర్‌ వి.వెంకటేశ్వర్లు జిల్లాకలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా కలెక్టర్‌ ఇరువురుని అభినందించారు. ఈనెల 5న ఉపాధ్యాయ దినోత్సవంను పురస్కరించుకొని విజయవాడలో జరిగిన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డులు పొందారు.