ప్రజాశక్తి-హిందూపురం : జిల్లావ్యాప్తంగా ఆటో కార్మిక సమస్యలపై రేపు జరుగు తేదీ 23 5 2023న ధర్నాను ఆటో కార్మికులంతా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని హిందూపురంలో కల్లూరు ఆటో స్టాండ్ ఆర్టిసి బస్టాండ్ కొటిపి ఆటో స్టాండ్ వివిధ ఆటో స్టాండ్ లో పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా హిందూపురం సిఐటియు పట్టణ నాయకులు వియర్ రాము మాట్లాడుతూజిల్లా వ్యాప్తంగా ఎంతోమంది ఆటో కార్మికుzర్పాటుచేసిన అవసరం ఎంతైనా ఉందని భగత్ సింగ్ ఆటో యూనియన్ సిఐటియుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీవో వేధింపులు పోలీస్ వేధింపులు పట్టణాల్లో ఆటో స్టాండ్ లేక ఆటో కార్మికులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని అలాగే ప్రభుత్వాలు ఇస్తున్న వాహన మిత్ర నిబంధనల పేరుతో చాలామంది ఆటో కార్మికులకు లబ్ధి చేకూరలేకపోతున్నది. వందమందిలో పదిమందికి మాత్రమే వాహన మిత్ర వస్తున్న పరిస్థితి ఈ తరుణంలో ఈ చలన పేరుతో కోట్లాది రూపాయలు ఆటో కార్మికుల ద్వారా వసూలు చేసి లక్షల్లో మాత్రమే కార్మికులకు రిటర్న్ గా ఇస్తున్న పరిస్థితి ఇప్పటికైనా ప్రభుత్వ వారు ఆటో కార్మిక సమస్యలపై స్పందించి వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆటో కార్మికులను ఆదుకోవాలని పోలీస్ వేధింపులు ఆర్టీవో వేధింపులు ఆపాలని అక్రమంగా బనాయిస్తున్న 290 పెట్టి కేసులు ఉపసంహరించుకోవాలని ఆటో డ్రైవర్లకు ఇల్లు ఇల్లు స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం వారు అక్రమంగా వేస్తున్న ఈ చలానను రద్దు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరడమైనది. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప ఆటో యూనియన్ పట్టణ కార్యదర్శి అత్తర్ బాబా మోధ స్టాండ్ సురేష్ బాలు ఆర్టీసీ బస్టాండ్ అంజనప్ప రామంజి మధు కొట్టిపి ఆటో స్టాండ్ గంగప్ప రమేష్ నాగరాజు రెహమాన్ ఖలీమ్ తహిదరులు పాల్గొన్నారు.










