పండ్లు పంపిణీ చేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి - క్యాంపస్
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం జాతీయసేవా సమితి యూనిట్-2 ప్రోగ్రాం ఆఫీసర్ డా.కె. స్వాతి, అసోసియేట్ ప్రొఫెసర్, ఐపిటి ఆధ్వర్యంలో గురువారం పాత శానంబట్ల గ్రామంలో వారం రోజుల ప్రత్యేక శిభిరం ముగిసింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సచివాలయంలో ప్రజలందరికి పరీక్షలు నిర్వహించి ఔషధ పంపిణి కార్యక్రమాన్ని నిపుణుల సమక్షంలో చేపట్టటం జరిగినది. వద్దులకు పండ్లు, మాస్క్ లు పంచి పెట్టారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బహుమతులు ఇచ్చారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ యశోదా శంకర్, యంపిటిసి భారతి పాల్గొని అభినందనలు తెలిపారు.










