అత్యంత పారదర్శకంగా
గ్రామసభలు నిర్వహించాలి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
గ్రామాల్లో నిర్వహిస్తున్న స్వామి మిత్రా సర్వే వేగవంతంగా నిర్వహించడం జరుగుతోందని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం సాయంత్రం కమిషనర్ కోనశశిధర్ వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 95 గ్రామాలకు సంబంధించి ఓఆర్‌ఐ రావడం జరిగిందని, 74 గ్రామాలలో గ్రౌండ్ ట్రూతింగ్ జరుగుతోందని, 14గ్రామాలలో గ్రౌండ్ వాలిడేషన్ జరుగుతోందని, మరో రెండు గ్రామాల్లో13 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందనీ, 5గ్రామాల్లో చర్యలు ప్రారంభించాల్సి ఉందని తెలిపారు. గ్రౌండ్ ట్రూతింగ్ నిర్వహించే సమయంలో గ్రామసభలు నిర్వహించడం జరుగుతుందని, ఈ గ్రామ సభలలో సంబంధిత అధికారులు అందరూ పాల్గొని ప్రజలకు వివరించడం జరుగుతుందని తెలిపారు. దీనికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డిపిఓ లక్ష్మి, డిఐ గణేష్‌లు పాల్గొన్నారు.
.










