'మహాశివరాత్రి'కి ముక్కంటి ధర్మకర్తల మండలికి మోక్షం
ఇందులో ఒకరు ఎక్స్ అఫిషియో సభ్యులు. ధర్మకర్తల మండలిని నియమిస్తూ సోమవారం అర్ధరాత్రి రాష్ట్ర దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణిమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మకర్తల మండలిలో అంజూరు తారక శ్రీనివాసులు, జల్లి క్రిష్ణయ్య, ఎన్.జయశ్యామ్, సాధన మునస్వామి, సి.ప్రకాశం పంతులు, పసల సుమతి, దాసరి జయమ్మ, ఎస్.లక్ష్మి, ఎం.రమాప్రభ, వి.చెంచులత, కొండూరు సునిత, ఎన్.మునిలక్ష్మి, పెద్దిరెడ్డి మల్లిఖార్జున రెడ్డి, కేసరి చిన్న సుబ్బారెడ్డి, ఎం.మహిధరెడ్డి, ఎక్స్ అఫిసియో సభ్యులుగా ఎస్ ఎం కే కష్ణమూర్తి గురుకుల్ ను నియమించారు. సభ్యులందరూ కలసి మండలి ఛైర్మన్ గా అంజూరు తారక శ్రీనివాసులును ఎన్నుకున్నారు. 2017, సెప్టెంబరు తరువాత ముక్కంటి ఆలయానికి ధర్మకర్తల మండలిని నియమించడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ధర్మకర్తల మండలిలో కొంతమంది స్థానికేతరులకు కూడా స్థానం కల్పించారు. వీరిలో పెద్దిరెడ్డి మల్లిఖార్జునరెడ్డి, కేసరి చిన్నసుబ్బారెడ్డి, ఎం. మహిధర్ రెడ్డి ఉన్నారు. నూతన ధర్మకర్తల మండలి మహాశివరాత్రిని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసింది.










