Oct 15,2023 22:37

ఫొటో : విచారణ చేపడుతున్న పోలీసులు

అట్రాసిటీ కేసుపై డిఎస్‌పి విచారణ
ప్రజాశక్తి-వరికుంటపాడు : మండలంలోని కాంచెరువులో ఇటీవల జరిగిన అట్రాసిటీ కేసుకు సంబంధించి కావలి డిఎస్‌పి ఎం.వెంకటరమణ ఆదివారం విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన గుంటుపల్లి నాగభూషణం పొలంలో కాపలాదారుడుగా ఉన్న జయంపు పోలయ్యపై అదే గ్రామానికి చెందిన బోడపాటి సుబ్బరాయుడు కులం పేరుతో తిట్టి, కొట్టినట్లు ఫిర్యాదు రావడంతో ఆ ఫిర్యాదు నిమిత్తం విచారణ చేపట్టినట్లు ఆయన తెలిపారు.
ఆయనవెంట ఉదయగిరి సిఐ గిరిబాబు, ఎస్‌ఐ విజరు శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.