Oct 01,2023 20:55

రమేష్‌ మృతదేహం

* డ్రైవర్‌ మృతి
* ఆరుగురికి గాయాలు
ప్రజాశక్తి- పలాస : 
మండలంలోని పాత జాతీయ రహదారి కోసంగిపురం రోడ్డులో ఆదివారం ఆటోను ఆర్‌టిసి బస్సు ఢకొీన్న ఘటనలో ఇచ్ఛాపురం మండలం డొంకూరుకు చెందిన ఆటో డ్రైవర్‌ రమేష్‌ (33) మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వజ్రపుకొత్తూరు మండలం కొత్తపేటకు చెందిన జి.రాంబాబు ఇచ్ఛాపురం మండలం డొంకూరుకు చెందిన అమ్మాయిని రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఐదు నెలల కుమార్తె ఉంది. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో కొత్తపేటలో ఉన్న రాంబాబు తల్లిదండ్రుల సమక్షంలో పంచాయితీ పెట్టేందుకు డొంకూరు గ్రామ పెద్దలు ఆటో బుక్‌ చేసుకుని వెళ్తున్నారు. కోసంగిపురం మలుపు వద్ద ఆటోను విశాఖ నుంచి మందస వైపు వెళ్తున్న ఆర్‌టిసి బస్సు ఢకొీంది. ఈ ప్రమాదంలో ఆటోడ్రైవర్‌ రమేష్‌, ముద్దాడ దేవమ్మ, బత్తుల ఎర్రయ్య, రాంబాబు, వి.పార్వతి, మాధవరావు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తన పెట్రోలింగ్‌ వాహనంలో పలాస ప్రభుత్వాస్పత్రికి క్షతగాత్రులను తరలించారు. వైద్యులు చిన్నంనాయుడు ప్రథమ చికిత్స చేసి, టెక్కలిలోని జిల్లా కేంద్రాస్పత్రికి రిఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి రమేష్‌ మృతిచెందాడు. మిగతా క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. రమృతుడికి భార్య నిత్య, 9 నెలల కుమారుడు ఉన్నారు. రమేష్‌ మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాశీబుగ్గ సిఐ శంకరరావు సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.