Mar 11,2022 22:03

గాంధీ విగ్రహానికి విని ఇస్తున్న సిఐటీయు నాయకులు


గాంధీ విగ్రహానికి వినతి సమర్పన
ప్రజాశకి-పుత్తూరుటౌన్‌:
శుక్రవారం ఆటో కార్మికులతో కలసి మున్సిపల్‌ కార్యాలయం వద్దనున్న గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆర్‌.వెంకటేష్‌ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రయాణికులు లేక, పెరిగిన ఇంధన ధరలు, మరోవైపు ఆటో ఫైనాన్స్‌ కంపెనీలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. 20 రూపాయల చొప్పున టోల్‌ రుసుం వసూలు చేస్తున్నారని కమిషనర్‌కు సంప్రదించగా మున్సిపాలిటీ నిబందనల మేరకు వసూలు చేయాలని, అధిక వసూళ్ళకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఏడాదితో ప్రస్తుత టెండర్‌ పూర్తవుతుందని, రాబోవు టెండర్‌ నందు ఆటోలకు మినహాయించాలని సిఐటియు నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మునిరాజా రమేష్‌, యాసిన్‌ భాష, వెంకటేష్‌, దాము, రవి, సురేష్‌ పాల్గొన్నారు.