Mar 05,2022 22:39

సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న ఆటో కార్మికులు


సిఐటియు ఆధ్వర్యంలో ఆటో కార్మికుల ధర్నా
ప్రజాశక్తి- పుత్తూరు టౌన్‌:
పట్టణంలోని ఆటో రుసుమును రద్దు చేయాలని పుత్తూరు మున్సిపల్‌ కార్యాయం ఎదుట ఆటో కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ముని రాజా, నగరి నియోజకవర్గ కార్యదర్శి ఆర్‌.వెంకటేష్‌ మాట్లాడుతూ రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఆటో కార్మికులు ఉంటే మున్సిపల్‌ అధికారులు ఒకపక్క టెండర్‌ రూపంలో ఆటో రుసుమును వసూలు చేయడం దారుణమన్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా పుత్తూరు, నగరిలలో రుసుమును వసూలు చేయడం ఆటో కార్మికులకు ఇబ్బందిగా మారిందన్నారు. అనంతరం పుత్తూరు మున్సిపల్‌ డిఈ వచ్చి టెండర్ను వాయిదా వేయడం జరిగిందని, తదుపరి టెండర్‌లో కార్మికులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వగా ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు ఆటో వర్కర్స్‌ నాయకులు రమేష్‌, శివ, బలరాం, సురేష్‌, చిరంజీవి, రవి, వెంకటేష్‌, తదితరులు పాల్గొన్నారు.