Jun 24,2023 21:33

ఆటోస్టాండ్‌ను ప్రారంభిస్తున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర

        ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌   ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. సిఐటియు అనుబంధం భగత్‌సింగ్‌ ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ న్యూ టౌన్‌ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని లక్ష్మీనగర్‌లో ఆటోస్టాండ్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు చలానాల వేస్తూ పోలీసులు ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. అలాగే ఇళ్ల స్థలాలు ఇవ్వడంతోపాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర న్యూటౌన్‌ అధ్యక్షులు గుర్రాజు, కార్యదర్శి ముత్తుజ, ఆటో యూనియన్‌ ఓల్డ్‌టౌన్‌ కమిటీ కార్యదర్శి ఎన్టీఆర్‌ శ్రీనివాసులు, న్యూ టౌన్‌ కార్యదర్శి ఆదినారాయణ, అవాజ్‌ నగర న్యూ కమిటి కార్యదర్శి ఇర్ఫాన్‌, ఆటో యూనియన్‌ ట్రెజరర్‌ రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.