Oct 12,2023 19:31

మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ మేకపాటి

మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ మేకపాటి
ఆత్మకూరులో జగనన్న సురక్ష
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌:దేశంలో ఎక్కడా లేనివిధంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా వైద్యసేవలను ప్రజలందరికి చేరువచేసి ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేయడమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లక్ష్యమని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్‌ రెడ్డి అన్నారు. గురువారం ఆత్మకూరు మున్సిపల్‌ పరిధిలోని ఎంజీఆర్‌ మోమెరియల్‌ మున్సిపల్‌ బస్టాండ్‌ సమీపంలోని అరుంధతీయవాడ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు