Mar 26,2022 23:41

విద్యార్ధిని ఆత్మహత్య గదిని పరిశీలించిన, జేఈఓ, ఐద్యా నేతలు


ఐద్వా జిల్లా కార్యదర్శి సాయి లక్ష్మి
ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌
శనివారం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా గల్స్‌ కన్వీనర్‌ శ్రావణి, ఐద్వా నాయకలు విష్ణుప్రియ ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించారు. విద్యార్థినులు ఏ సమస్య వచ్చినా ధైర్యం ఎదుర్కొనేలా ఉండాలని సూచించారు. అనంతరం టిటిడి జేఈవో సదాభార్గవితో మాట్లాడారు. ప్రతివారం విద్యార్థులకు కౌన్సిలింగ్‌ క్లాసులు ఏర్పాటు చేయాలని కోరారు. ఆలాగే కాలేజ్‌లో కంప్లైట్‌ బాక్స్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. వారి వెంట ఐద్వానగర కార్యదర్శి ఎం.జయంతి, లావణ్య, అమ్మాజీ ఉన్నారు.