Jun 13,2022 23:26

ఓఆర్‌ఎస్‌, జింక్‌ కార్నర్‌ కేంద్రాన్ని లాంచనంగా ప్రారంభిస్తున్న దృశ్యం

డిఎంఅండ్‌ హెచ్‌ఓ శ్రీహరి
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:
ఈనెల 13వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అతిసార వ్యాధి నివారణ పక్షోత్సవాల నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారి శ్రీహరి తెలిపారు. ఈసందర్భంగా జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయ ప్రాంగణంలో సోమవారం ఓఆర్‌ఎస్‌, జింక్‌ కార్నర్‌ కేంద్రాన్ని లాంచనంగా ప్రారంభించారు. డిఎం అండ్‌హెచ్‌ఓ మాట్లాడుతూ ఉధత అతిసార నియంత్రణకు ఓఆర్‌ఎస్‌ ద్రావణం, జింక్‌ మాత్రలు ఇవ్వాలన్నారు. అతిసార వ్యాధికి ఓఆర్‌ఎస్‌ ద్రావణం, జింక్‌ మాత్రలు సరియైన చికిత్స విధానమని అన్నారు. 0-5 సంవత్సరములోపు పిల్లలకు విరేచనాలు అయినప్పుడు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్టును ఒక లీటరు నీటిలో కలిపి పిల్లలకు తాగించాలని సూచించారు. శరీరంలో నీటిశాతం తగ్గడం బిడ్డకు చంచలత్వం, చిరాకు, మైకం లేదా అపస్మారక స్థితి ఉంటే, కళ్లు లోపలికి వెళ్లినట్లు ఉండటం వంటి లాంటి లక్షణాలు పిల్లల్లో కనిపించిన వెంటనే ఓఆర్‌ఎస్‌ ద్రావణాన్ని తాగించి దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి, చికిత్సలు అందించాలని తెలియజేశారు. అలాగే క్షేత్రస్థాయిలో ఐఇసి కార్యక్రమాల ద్వారా అతిసారపై అవగాహన కార్యక్రమాలు పక్షం రోజుల పాటు నిర్వహించాలని, ప్రతి వైద్యాధికారి ఏఎన్‌ఎం, ఎఎస్‌హెచ్‌ఏ, ఎడబ్ల్యూడబ్ల్యూ క్షేత్రస్థాయిలో అతిసార లక్షణాలు ఉన్నవారిని గుర్తించి చికిత్సలు అందించి పిల్లల ప్రాణాలు కాపాడాలని తెలియజేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ రవిరాజు డిఐఓ, డాక్టర్‌ శ్రీనివాసరావు ఎస్‌పిహెచ్‌ఓ, డాక్టర్‌ సుదర్శన్‌ డిసి- ఆర్‌బిఎస్‌కె, డాక్టర్‌ హరినాథరెడ్డి డివై.డిఎంహెచ్‌ఓ, జయరాముడు డివై.డిఎంహెచ్‌ఓ,రేణుక ప్రభ, డిపిహెచ్‌ఎన్‌ఓ, డిఐఓ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.