Apr 09,2023 22:24

అన్నదానం చేస్తున్న దృశ్యం

అనంతపురం : నిత్యసురభి చారిటబుల్‌ ట్రస్ట్‌, పుట్టినిల్లు వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ట్రస్టు ఛైర్‌ పర్సన్‌ డాక్టర్‌ నిర్మల మురళి పేదలకు అన్నదానం చేశారు. ట్రస్ట్‌ సభ్యులు టుంకూర్‌ వాస్తవ్యులు బద్రీనాథ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించినట్లు ఆమె తెలిపారు. మన కుటుంబ సభ్యుల శుభకార్యాల సందర్భంగా పేదల ఆకలి తీర్చడం సంతోషంగా ఉంటుందన్నారు. పుట్టినరోజున పేదలకు సహాయం చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, కిష్టప్ప, పాపయ్య, సుబ్బారావు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.