ప్రజాశక్తి - భీమవరం రూరల్
పట్టణంలో నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి పనులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామని ఎంఎల్‌శ్రీ గ్రంధి శ్రీనివాస్ అన్నారు. సోమవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎపిఐఎంసిడి అధికారులతో ఆయన సమీక్షించారు. 100 పడకల ఆసుపత్రి వల్ల నియోజకవర్గ ప్రజలతో పాటు జిల్లా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో డిఇ శ్రీనివాస్‌రెడ్డి, ఎన్‌సిసి చైతన్యకృష్ణ పాల్గొన్నారు.










