అన్నదానం చేస్తున్న దృశ్యం
ఆశ్రమంలోని బాలలకు అన్నదానం
ప్రజాశక్తి-కొడవలూరు :మండలంలోని టపాతోపు విశ్వజనని అనాథాశ్రమంలోని బాలబాలికలకు బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. డ్రైమ్ సర్వేలెన్స్, ఇంటలిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర కోఆర్డినేటర్ చుక్కా పవన్‌కుమార్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన మిత్ర బందం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మిత్ర బంద సభ్యుడు స్వర్గా నవీన్ మాట్లాడుతూ అనాథ బాలబాలికలకు తనవంతు సాయపడాలన్న ఉద్దేశంతో పవన్‌కుమార్‌రెడ్డి ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని సూచించారన్నారు. ఆశ్రమంలోని బాలలకు అవసరమైన విషతులకు తనవంతు నిధులు సమకూర్చుతానని వషన్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మిత్ర బంద సభ్యులు కాగితాల సాయి సందీప్, కోటి, సాయిచంద్, రాఘవేంద్ర, రాఘవ, ఆశ్రమ నిర్వాహకులు ఖుర్గా శ్రీలక్ష్మి, ప్రేమ్ సాగర్లు పాల్గొన్నారు.










