Apr 02,2023 15:27
  • వైయస్సార్ ఆసరా మూడో విడత చెక్కు పంపిణీ 

ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలను ప్రస్తుత ముఖ్యమంత్రిజగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన పాదయాత్రలో స్వయం సహాయక సంఘాల్లోని పేద మహిళల యొక్క ఆర్థిక పురోగతి దాహపడుతూది ఇది గుర్తించి నాయన ప్రస్తుతం అనేక పథకాలు ప్రవేశపెట్టినారు. అందరూ భాగంగా మండలంలో వైయస్సార్ ఆసరా మూడో విడత కార్యక్రమం నియోజకవర్గ శాసనసభ్యులు వెంకటే గౌడ జిల్లా జడ్పిటిసి శ్రీనివాసులు, డిసిసిబి బ్యాంక్ చైర్మన్ రెడ్డమ్మ కృష్ణమూర్తి, మండల ఎంపీపీ ఎం రెడ్డప్ప, జడ్పిటిసి కేశవులు మరియు సర్పంచులు ఎంపీటీసీలు అధిక సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మహిళలతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం కేకును కట్ చేసి మహిళలకు పంచిపెట్టారు. సభ అధ్యక్షులుగా ఎంపీపీ రెడ్డప్ప కార్యక్రమాన్ని కొనసాగించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళను ఉద్దేశించి 0 వడ్డీ వైయస్సార్ ఆసరా వైయస్సార్ చేయూత జగనన్న తోడు వివిధ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలు ఆర్థికంగా ఎదిగి ముందుకు సాగే విధంగా 1056 సంఘాలకు గాను 9 కోట్ల 63 లక్షల రూపాయలు చెక్కును మరియు ఎస్సీ ఎస్టీ గ్రూపుల స్పెషల్ లోన్ సంబంధించి ఎస్సి గ్రూపులకు 45750 రూపాయల చెక్కును మహిళలకు అందజేశారి అలాగే మండలంలో చేసిన అభివృద్ధి పనులపై మహిళలకు వివరించారు. ఈ పథకాలన్నీ కొనసాగాలంటే మళ్ళీ ఫ్యాన్ గుర్తుకే ఓటేసి జగనన్న ముఖ్యమంత్రి చేయాలని అక్కడికి వచ్చిన మహిళలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పలమనేరు నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకట్ గౌడ, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, డిసిసి బ్యాంక్ చైర్మన్ పర్సన్ రెడ్డమ్మ కృష్ణమూర్తి, మండల ఎంపీపీ ఎం రెడ్డప్ప, మండల సచివాలయ కన్వీనర్ కార్తీక్, ఏపిఎం సీసీలు సంఘమిత్రాలు మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.