Mar 25,2023 15:30

ప్రజాశక్తి-నార్పల : నార్పల మండల కేంద్రంలోని ఆర్బికేలలో శనివారం వైయస్సార్ ఆసరా మూడో విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించడం అయినది ఏలూరులో జరిగిన సీఎం కార్యక్రమాన్ని లైవ్లో సభ్యులకు అందరికీ చూపించారు. నార్పల మండలంలోని 1059  సంఘాలకు 9 కోట్ల 51లక్షల ఏడువేల 463 రూపాయలు మంజూరు అయింది. ఏపీఎం తిప్పమ్మ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక సర్పంచ్ సుప్రియ  మండల పరిషత్ ఏఓ  ఉమాదేవి  లక్ష్మీబాయి మండల అధ్యక్షురాలు రేఖ  సిబ్బంది సంఘ సభ్యులు హాజరు కావడం జరిగింది.  ఈ కార్యక్రమంమండలం లోని అన్ని RBK ల నందు నిర్వహించడం జరిగింది.