Mar 20,2023 20:58

ప్రజాశక్తి - ఆకివీడు
అసెంబ్లీ సాక్షిగా ప్రజాప్రతినిధులపై దాడి చేయించి ముఖ్యమంత్రి ఆనందం పొందుతున్నారని టిడిపి నాయకుడు, విజయవాడ ఎంపీ కేశినేని నాని సోదరుడు కేశినేని శివనాద్‌ (చిన్ని) అన్నారు. అసెంబ్లీలో టిడిపి ఎంఎల్‌ఎలపై దాడిచేయడాన్ని ఖండిస్తూ టిడిపి ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం కొద్దిసేపు రాస్తారోకో, నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా చిన్ని మాట్లాడారు. ముఖ్యమంత్రి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని విమర్శించారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు మోటిపల్లి ప్రసాద్‌, కార్యదర్శి నవకోట్ల రామారావు, పట్టణ అధ్యక్షులు బొల్లా వెంకట్రావు, కార్యదర్శి గంధం ఉమా సత్యనారాయణ పాల్గొన్నారు.