అసైన్మెంట్ భూముల వివరాలను ప్రకటించాలి
జెసికి సిపిఎం వినతి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: భూమిలేని గ్రామీణ, పేదలు, దళితుల అభ్యున్నతి, ఆత్మగౌరవం కోసం ఇచ్చిన అసైన్మెంట్ భూములను ప్రభుత్వమే అమ్ముకోవచ్చని ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని సిపిఎం చిత్తూరు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదని వెంటనే జిల్లాలో ఉన్న అసైన్మెంట్ భూముల వివరాలను ఆయా సచివాలయాల దగ్గర నోటీసు బోర్డులో వేయాలని సోమవారం సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన జేసీతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పై జిల్లాలో అన్ని రాజకీయపక్షాలతో చర్చించిన తర్వాతే సర్వేలు చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని సచివాలయాల దగ్గర భూముల వివరాలు వేస్తామని చెప్పిన ఇప్పటివరకు జిల్లాలో ఎక్కడ పెట్టలేదని అన్నారు. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని ఇప్పటికే అనేకమంది దళితుల పేదల భూములు అన్యాక్రాంతమయ్యాయని తెలిపారు. ప్రభుత్వం 9/77 చట్టాన్ని సవరించడం వలన పేదలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములను పెత్తందారుల వసమవుతాయని దీని వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నదని తెలిపారు. రెండున్నర ఎకరాల మాగాని ఐదు ఎకరాల మెట్ట భూమి ఉన్న రైతులు అసైన్డ్ భూములు కలిగి ఉంటే వారిని మినహాయించాలని తెలిపారు. కొన్ని చోట్ల పేదల బలహీనతను ఉపయోగించుకొని పావులో పాతిక ఇచ్చి తమ భూములు పక్కన కలిపేసుకున్నారని, ఇటువంటి అన్యాక్రాంతమైన భూములు తిరిగి ఆ పేదలకు ఇవ్వాలని 9/77 చట్టం చెబుతున్నదన్నారు. ఈ చట్టం ఉండబట్టే భూములు కోల్పోయిన పేదలు పోరాడి లేదా న్యాయస్థానాలను ఆశ్రయించి తిరిగి పొందుతున్నారు కానీ నేడు ఈభూములను కార్పొరేట్ కంపెనీలకు భూస్వాములకు కట్టబెట్టడానికే చట్ట సవరణ చేసి గవర్నర్ ద్వారా జూలై 31న ఆర్డినెన్స్ తెచ్చారన్నారు. సవరించిన సెక్షన్3లో భూమి మాస్టర్‌ప్లాన్ పక్కన వ్యవసాయేతర అవసరాల కోసం ఆక్రమించుకున్నట్లయితే ఆ భూములకు మార్కెట్ రేట్ ప్రకారం అసైన్డ్దారులకు డబ్బు చెల్లించాలని సవరణ చేశారు. ఈ సవరణ ద్వారా ఇప్పటికే అన్యాక్రాంతమైన భూములను ఇలాంటి తప్పుడు పద్ధతులు పేరుతో పేదల భూములను రాజమార్గంలో కొట్టేయడానికి భూస్వాములకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. గుండె దురాక్రమణ చేసిన రియల్ ఎస్టేట్ పరిశ్రమలు పెట్టని కాళీ కంపెనీ భూములను అసైన్దారుల పరం చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది. పేదలు పొందిన అసైన్డ్ భూములను అభివద్ధి చేసుకొని వారి జీవితాలు వారి పిల్లలు భవిష్యత్తు అభివద్ధి చేసుకోవడానికి పెట్టుబడి, సాగునీటి సౌకర్యం ,పరపతి సౌకర్యం కల్పించి వారికి అభివద్ధి చేయాల్సింది పోయి భూములు అమ్ముకోమని ప్రోత్సహించడం అభివద్ధి నిరోధక చర్య. ఇప్పటికైనా ప్రభుత్వం తెచ్చిన సవరణ అసైన్డ్ భూముల హక్కుదారుల కంటే అక్రమంగా దౌర్జన్యంగా అనుభవిస్తున్న భూస్వాములకు మేలు చేయడానికి పిఓటి యాక్ట్ నైన్.9/77 చట్టాన్ని సవరించారు. రాష్ట్ర ప్రభుత్వం సర్వేచేసే లోపు చిత్తూరు జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్న అసైన్డ్ భూముల వివరాలను నోటిఫికేషన్ పెట్టాలని వినతి పత్రంలో డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా నాయకులు కె. సురేంద్రన్ తదితరులు పాల్గొన్నారు.










