ప్రజాశక్తి - పాలకొల్లు రూరల్
ఆశాలపై పని భారం తగ్గించాలని ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సిహెచ్.లక్ష్మి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె లంకలకోడేరు ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ అడ్డాల ప్రతాప్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆశాలతో సంబంధం లేని పనులు చేయిస్తున్నారని, ఆన్‌లైన్ వర్క్ తగ్గించాలని, ప్రభు త్వ సెలవులు, మెడికల్ లీవులు మంజూరు చేయాలని, ప్రయాణ ఖర్చులు ఇవ్వాలని, ప్రతి ఒక్కరికీ గ్రూప్ ఇన్సూరెన్స్ రూ.పది లక్షలు కల్పించాలని ఆమె కోరారు. వినతి పత్రం సమర్పించిన వారిలో ఆశాలు శిరోమణి, విజయదుర్గ, డి.దానేశ్వరి ఉన్నారు.










