Mar 22,2022 23:49

సమ్మె నోటీసు అందిస్తున్న ఆశావర్కర్స్‌ యూనియన్‌ నాయకులు



ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌:
ఈ మేరకు జిల్లాలోని ఆశా వర్కర్లు రెండు రోజుల పాటు సమ్మెలో పాల్గొంటున్నట్లు డిఎంఅండ్‌హెచ్‌ఒ కార్యాలయ ఏఒకు మంగళవారం సమ్మె నోటీసును అందించారు. ఈ సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ స్కీమ్‌ వర్కర్ల సమస్యల పరిష్కారం, కార్మిక చట్టాల మార్పును విరమించుకోవాలని కోరుతూ రెండు రోజులు దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో జిల్లాలోని అన్ని వర్గాల కార్మికులు, స్కీమ్‌ వర్కర్లు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.