'ఆర్థిక అక్షరాస్యత'పై సదస్సు
ప్రజాశక్తి-ఉదయగిరి : మండల పరిధిలోని జి.అయ్యవారిపల్లి గ్రామంలో బుధవారం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ దొనబాబు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాబార్డ్ సౌజన్యంతో చైతన్య జానపద కళాబృందంతో బ్యాంకు పథకాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రధానమంత్రి జీవనజ్యోతి ప్రధానమంత్రి జీవన సురక్షిత అటల్ పెన్షన్ పథకాలపై అవగాహన కల్పిస్తూ విద్యా వ్యాపారం గృహ రుణాలను తక్కువ వడ్డీకే ఆంధ్ర ప్రగతి బ్యాంక్ అందిస్తున్నామన్నారు. పొదుపు మహిళలకు ఎక్కువగా రుణాలు ఇచ్చి బ్యాంకు తోడ్పాటిస్తుందన్నారు. రైతులకు పంట రుణాలను సకాలంలో రెన్యువల్ చేసుకొని రాయితీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జీరో బ్యాలెన్స్ అకౌంట్లను బ్యాంకు మిత్ర దగ్గర ఓపెన్ చేయించుకోవచ్చని, ఎటిఎం కార్డులు ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాసులు, బిసి నాయకులు కోఆర్డినేటర్ అన్వర్ భాషా, ఖాతాదారులు పాల్గొన్నారు.










