
అవగాహన కల్పిస్తున్న మాధవ్
ప్రజాశక్తి - శ్రీకాకుళం : ఎపిఎస్ ఆర్‌టిసి హెవీ డ్రైవింగ్ స్కూల్ 14వ బ్యాచ్‌ను శ్రీకాకుళం ఒకటో డిపో మేనేజర్ కె.మాధవ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్‌టిసి హెవీ డ్రైవింగ్ స్కూల్‌లో నాణ్యమైన శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి విషయాన్నీ అవగాహన చేసుకుని నేర్చుకుంటే భవిష్యత్‌లో మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతారని చెప్పారు. తదుపరి బ్యాచ్ వివరాలు, ఫీజుకు సంబంధించిన వివరాల కోసం 9963091999., 7989723505 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో రెండో డిపో మేనేజర్ కె.ఆర్.ఎస్ శర్మ, డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్ వర్మ, ఎ.ఎన్.ఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.