
కోలగట్లకు జ్ఞాపికను అందజేస్తున్న ఆలయ అధికారులు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: అరసవల్లి సూర్యనారాయణ స్వామిని శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మతో పాటు పాలకమండలి సభ్యులు మండవల్లి రవి, గోవింద్, సూపరింటెండెంట్ కృష్ణమాచార్యులు అనివెట్టి మండపంలో స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి జ్ఞాపికను అందజేశారు.
రూ.3.71 లక్షల ఆదాయం
అరసవల్లి ఆలయానికి ఆదివారం యాత్రికుల రద్దీ కొనసాగింది. టిక్కెట్ల విక్రయాల ద్వారా రూ.1,26,400, విరాళాల రూపంలో రూ.74,954, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.1.70 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఇఒ వి.హరి సూర్యప్రకాష్ తెలిపారు.