Oct 03,2023 21:46

ఫొటో : వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి

'ఆరోగ్యశ్రీ'తో మెరుగైన వైద్యం
ప్రజాశక్తి-దగదర్తి : పేద ప్రజలకు కార్పొరేట్‌ హాస్పిటల్‌ల్లో మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి అన్నారు. అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకంలో అనేక కొత్త రోగాలను చేర్చారని తెలిపారు. మండలంలోని చెన్నూరు పంచాయతీలో జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతమంది నిరుపేదలు వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకొని వచ్చి ఎంతమంది ప్రాణాలు నిలిపిన దాత రాజశేఖర్‌ రెడ్డి అని కొనియాడారు. అయినా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రజలకు ఇంకా మంచి చేయాలని ఉద్దేశంతో గ్రామంలోని హెల్త్‌ క్లినిక్‌ ఏర్పాటు చేశారని తెలిపారు.
హెల్త్‌ క్లినిక్‌లో డాక్టర్‌ ఇద్దరు నర్సులు అందుబాటులో ఉంటారన్నారు. అనంతరం ఎంపిపి మాట్లాడుతూ రెండు రోజుల కిందట వడ్డెరకు చెందిన పదేళ్ల బాలికకు కిడ్నీ, లివర్‌ చెడిపోయాయని ఆపరేషన్‌ చేయాలంటే రూ.20 లక్షలు ఖర్చు అవుతుందని తల్లిదండ్రులకు డాక్టర్‌ చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వారు తన దగ్గర వచ్చాని తెలిపారు. ఈ విషయమై స్థానిక ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డికి తీసుకొని వెళ్లడంతో చెన్నైలో ఉన్న విజయ హాస్పిటల్‌ బాలిక చికిత్స తీసుకుంటున్న విషయాన్ని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే పెద్ద మనసు చేసుకొని సిఎం మాట్లాడి ఆ బాలికకు ప్రభుత్వం నుంచి రూ.20 లక్షలు సాయం అందించినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డిని నియోజకవర్గంలో రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ విజరు కుమార్‌, డాక్టర్లు, నర్సులు, వలంటీర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు .