Mar 18,2022 23:21

సమావేశంలో కలెక్టర్‌


సీఎంసి యాజమాన్యాన్ని కోరిన కలెక్టర్‌
ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌:
శుక్రవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌ (అభివద్ధి) శ్రీధర్‌తో కలసి సిఎంసి యాజమాన్యంతో సమావేశమయ్యారు. సిఎంసి యాజమాన్యం మాట్లాడుతూ చిత్తూరులో సిఎంసి ఆసుపత్రిని 2019 నుండి అన్ని విభాగాల్లో కనీసం ముగ్గురు డాక్టర్లను పెట్టి నిర్వహిస్తున్నామని, దీనికి నర్సింగ్‌ కాలేజి అనుబంధంగా ఏర్పాటు చేసి 150 మంది నర్సింగ్‌ పిల్లలు విద్యనభ్యసిస్తున్నారన్నారు. మెడికల్‌ కాలేజి 2026 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని ప్రణాళికతో ఉన్నామన్నారు. ప్రస్తుతం 120 బెడ్లతో ఉన్న ఆసుపత్రి రాబోయే రోజుల్లో 300 బెడ్లతో నిర్వహిస్తామన్నారు. జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ కార్డుదారులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా జిల్లాలోనే అన్ని జబ్బులకు వైద్య సేవలను పొందేలా సహకరించాలన్నారు. ఈ సమావేశంలో డిఎం అండ్‌ హెచ్‌ఓ డా. శ్రీహరి, సిఎంసి యాజమాన్యం డా. కేంగ్రీ గ్రేస్‌, డా.సురజిత్‌ భట్టాచార్య, డా.మ్యాథ్యు పాల్గొన్నారు.