Oct 26,2023 22:34

పోలాకి : నేత్రాలను పరిశీలిస్తున్న వైద్య సిబ్బంది

కోటబొమ్మాళి: ఆరోగ్యకర సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని మండల పరిషత్‌ అధ్యక్షుడు రోణంకి ఉమామల్లేశ్వరరావు అన్నారు. మండలంలోని కురుడు గ్రామ సచివాలయ పరిధిలో జిల్లా పరిషత్‌ పాఠశాలలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాథమిక వైద్య కేంద్రం వైద్యలు డి.నీరజ, మనీష, ప్రీతి, జోత్న్స, సురేష్‌, నితీష్‌కుమార్‌లు 391 మంది పలు రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ కె.ఫణీంద్రకుమార్‌, డిటి ఆర్‌.మధు, ఇఒపిఆర్‌డి బొడ్డేపల్లి రామారావు, కళింగ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ సంపతిరావు హేమసుందరరాజు, రొక్కం సూర్యప్రకాష్‌, సర్పంచ్‌ కోతి చిన్నారావు, పేడాడ వెంకటరావు పాల్గొన్నారు.
పోలాకి : మండలంలోని రేగుపాడులో నిర్వహించిన జనగన్న ఆరోగ్య సురక్షను రెహమాన్‌పురం సర్పంచ్‌ సనపల సోమేశ్వరరావు ప్రారంభించారు. గుప్పిడిపేట పిహెచ్‌సి వైద్యులు రత్నరాజు, చందన్‌, గోపాల్‌లు రోగులను పరిశీలించి మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి కె.తాతారావు, వెంకటేశ్వరరావు, డిటి పి.శ్రీనివాసరావు, ఎంపిడిఒ ఉషశ్రీ, కార్యదర్శి నాగరాజు, విఆర్‌ఒ వెంకట రమణ పాల్గొన్నారు.
వజ్రపుకొత్తూరు: ఆరోగ్యమే మహాభాగ్యమని ఎంపిడిఒ ఈశ్వరమ్మ అన్నారు. మండలంలోని నువ్వులరేవులో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్షను ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్స్‌ను పరిశీలించారు. అనంతరం రోగులకు మందులను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఎజ్రా, వైస్‌ సర్పంచ్‌ దేవ,డిటి గిరిరాజు, వైద్యులు, అంగన్వాడీ కార్యకర్తలు ఇందు, చామంతి, కార్యదర్శి అదిల్‌ షా, విఆర్‌ఒ కె.హైమవతి పాల్గొన్నారు.
పొందూరు: మండలం బురిడి కంచరాంలో కింతలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గురువారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని నోడల్‌ అధికారి టి.వాసుదేవరావు పరిశీలించి వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ సీపాన హరిహరరావు, ఇఒపిఆర్‌డి సింహాచలం, సర్పంచ్‌ ప్రతినిధి గంట్యాడ రమేష్‌, ఎంపిటిసి బొత్స రమణ, వైసిపి మండల జెసిఎస్‌ బాడాన వెంకట కృష్ణారావు, వైద్యాధికారులు సాగరిక, శివశంకర్‌, సిహెచ్‌ఒ వాణికుమారి, సూపర్‌వైజర్‌ మణిప్రసాద్‌, వైద్యసిబ్బంది, అంగన్వాడి, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.
రణస్థలం రూరల్‌: మండలం వల్లభరావుపేటలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎంపిపి ప్రతినిధి పిన్నింటి సాయికుమార్‌, జెడ్‌పిటిసి టొంపల సీతారాం గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి ప్రతినిధి మైలపల్లి కామరాజు, మండల మహిళా అధ్యక్షులు గురాన మానస, జెసిఎస్‌ ఇన్‌ఛార్జి చిల్ల వెంకటరెడ్డి, గురాన చిరంజీవి, మహంతి సత్యనారాయణ పాల్గొన్నారు.