Oct 11,2023 16:47

ఆరోగ్య శిబిరంలో అధికారులు, ప్రజాప్రతినిధులు

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :ప్రజల ఆరోగ్యానికి జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎంపీపీ ఉప్పల స్వర్ణలత పేర్కొన్నారు. తోటపల్లిగూడూరు మండలం వరకువిపూడి గ్రామంలో బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం జరిగింది. వైసీపీ నాయకులు, సర్పంచ్‌ ఇసనాక రమేష్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ కన్వీనర్‌ ఉప్పల శంకరయ్య గౌడ్‌, ఎంపీడీఓ కన్నం హేమలత, తాసిల్దార్‌ లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యంగా వుండాలన్నదే సీఎం ఉద్దేశ్యం అన్నారు. అందుకోసమే జగన్మోహన్‌ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష పథకానికి శ్రీకారం చుట్టారని స్వర్ణలత తెలిపారు. వ్యాధులతో బాధపడే వారిని గుర్తించి మెరుగైన వైద్యాన్ని అందించేందుకు 'జగనన్న ఆరోగ్య సురక్ష అద్భుతమైన పదకమన్నారు. ప్రతి ఇంటిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ఆరోగ్యపరంగా సురక్షితంగా ఉంచే కార్యక్రమమే 'జగనన్న ఆరోగ్య సురక్ష' అని ఆమె తెలిపారు. శంకరయ్య గౌడ్‌ మాట్లాడుతూ ఇప్పటికే అమలు చేసిన జగనన్న సురక్ష కార్య­క్రమం తరహాలోనే ఇప్పుడు 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. మొత్తం ఐదు దశల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని హెల్త్‌ క్యాంపులతో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రమేష్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన అన్ని రకాల వ్యాధులకు వైద్యులు ఇళ్ళ వద్దనే చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. 'ఇంటింటి సర్వే ద్వారా ప్రతి కుటుంబంలోని సభ్యులందరికీ ఇళ్ల వద్దనే ఏడు రకాల పరీక్షలు నిర్వహించే ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు అయన చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలు ఆరోగ్యంగా వుండాలన్న సంకల్పంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి నియోజకవర్గం పరిధిలో పటిష్టంగా అమలు చేస్తున్నారని రమేష్‌ రెడ్డి పేర్కొన్నారు. సర్వేలో గుర్తించిన వ్యాధులకు వైద్య శిబిరాల ద్వారా ఉచితంగా చికిత్సలు అందిస్తున్నట్లు ఎంపీడీఓ హేమలత తెలిపారు. వైద్య శిబిరంలో వరిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది రోగులను పరీక్షించి మందులు ఇవ్వడం జరిగింది. వైసీపీ నాయకులు, ఆరోగ్య సురక్ష సర్వే వైద్య సిబ్బంది, తహసిల్దార్‌ లావణ్య, ఎంపీడీవో హేమలత, ఈవోపీఆర్డి నారాయణరెడ్డి పాఠశాల సిబ్బంది ఉన్నారు.