ప్రజాశక్తి-పుత్తూరు టౌన్:
మానవ శరీరంలో వివిధ రకాల వ్యాధులు, కరోనా, మలేరియా, పోలియో, ఫైలేరియా, టీబి వంటి వ్యాధులు నివారించడానికి ముందస్తు టీకాలుతో పాటు నడక కూడా దోహదపడుతుందని జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ రవిరాజు తెలిపారు. ఆదివారం పుత్తూరు వాకర్స్ అసోసియేషన్ సర్వసభ సమావేశం అధ్యక్షులు మురుగా రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. పదోన్నతి పొందిన డాక్టర్ రవిరాజుకు పుత్తూరు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీకాలతో పాటు వ్యాధి నివారించడానికి ఇమ్యూనిటీ చాలా అవసరమన్నారు. ఉదాహరణకు డి విటమిన్ అవసరం నడక వల్ల డి విటమిన్ వస్తుందన్నారు 12 వయసు నుంచి 15 వయసు గల చిన్న పిల్లలు వ్యాక్సినేషన్ వేసుకోవాలన్నారు. పెద్దలు కూడా బూస్టర్ వాక్సినేషన్ వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు శ్రీనివాసులురెడ్డి, శేఖర్‌రెడ్డి, కుప్పశెట్టి, రామచంద్రనాయుడు, నరసింహారావు, కష్ణమూర్తి, రఘునాథ్‌రెడ్డి, రవివర్మ సభ్యులు పాల్గొన్నారు.










