ప్రజాశక్తి-నగిరి : నగరిలోని ప్రైవేట్ కళ్యాణమండపంలో నగరి రెవెన్యూ డివిజన్ పరిధిలో చేపట్టిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నిర్వహించిన ఆరోగ్యానికి భరోసా - ప్రగతికు హామీ ఆయష్మాన్ భారత్ - ఆరోగ్య మేళా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, మరియు యువజన సర్వీసుల క్రీడా శాఖామాత్యులు ఆర్కే రోజా పాల్గొని ఏర్పాటు చేసిన 15 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించే స్టాల్స్ ను పరిశీలించారు. కార్యక్రమం మధ్యలో ఫ్యామిలీ హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సేకరించిన విజయపురం మండలము యొక్క పూర్తి ఆరోగ్య సమాచార పుస్తకంను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
పేదవాళ్ళుకు ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్స్ ఇస్తున్న విషయాన్ని తెలియపరచి గ్రామ స్థాయిలో ఆశా వర్కర్లకు, ఏఎన్ఎం లకు ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్స్ గురించి క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని కోరారు.
ముఖ్యమంత్రి జగనన్న పేదవాడి ఆరోగ్యానికి ముఖ్యత్వం ఇస్తూ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద గతంలో 1059 వైద్య సేవలు ఉండగా ఇప్పుడు వాటిని 2446 కు పెంచారని అన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి పక్కరాష్ట్రాలలోను 130 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలలో వైద్యం చేసుకోడానికి అవకాశం కల్పించారని, ఆరోగ్య శ్రీ పరిధిలోనికి రాని వైద్య సేవలకు ముఖ్యమంత్రి సహాయ నిధికు పెట్టుకోవచ్చనీ తెలిపారు. కోవీడ్ కష్ట కాలంలో కోవీడ్ సెంటర్లను ఏర్పాటు చేసి దేశం మొత్తం మెచ్చుకునే విధంగా ప్రతి ఒక్కరికీ ఉచిత ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగిందని, మొదటి, రెండ విడత కోవీడ్ వ్యాక్సిన్లను విజయవంతంగా పూర్తి చేసిన రాష్ట్రం, దేశంలోనే మన రాష్ట్రమేనని అన్నారు. నాడు - నేడు కింద కొన్ని వేలకోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఆసుపత్రి స్థితి గతులను మార్చారని, కొత్తగా 44300 ఉద్యోగాలను సృష్టించి సామాన్య ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి చర్యలు తీసుకున్నారని, ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టే గత 3 సంవత్సరాలు మనమంతా ఆరోగ్యంగా ఉన్నామని అన్నారు. మన దురదృష్టం
ిచంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో ఉండి గత ప్రభుత్వంలో ఆసుపత్రి వ్యవస్థను నిర్వీర్యం చేశారని, గత ప్రభుత్వం పనితీరుకు ఇప్పటికీ తేడాను తేటతెల్లం చేశారు.










