Oct 28,2023 23:47

పోలాకి: మాట్లాడుతున్న ఎమ్మెల్యే కృష్ణదాస్‌

ప్రజాశక్తి- పోలాకి: ఆరోగ్య సురక్షతో ప్రజలకు రక్షని ఎంఎల్‌ఎ ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. శనివారం గాతలవలస పంచాయతీలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ వైద్యసేవలు విస్తరింప చేయాలనే ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఇందులో అనేక రకాల వ్యాధులకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తున్నారని, సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి ముద్దాడ బైరాగినాయిడు, వైసిపి మండల కన్వీనర్‌ కణితి కృష్ణారావు, వైసిపి నాయకులు ఆర్‌.త్రినాథరావు, రాయిల మల్లేశ్వరరావు, చింతాడ ఉమా, చింతు రాఘవరావు, డిటి పి. శ్రీనివాసరావు, ఎంపిసొ ఉషశ్రీ, వైద్యులు శ్రీనాథ్‌, రత్నరాజు, చందన్‌, ఎన్‌.రవికుమార్‌, కార్యదర్శి సూర్య నారాయణ, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
్‌రణస్థలం: అర్జునవలస గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు. కార్యక్రమంలో రణస్థలం మండల మహిళా అధ్యక్షులు గురాన మానస, మండల మహిళా సమైక్య అధ్యక్షులు రామిశెట్టి లక్ష్మి, అర్జునవలస పంచాయతీ సర్పంచ్‌ ప్రతినిధి మీసాల రామునాయుడు, వైసిపి నాయకులు రామిశెట్టి మహేష్‌, సిరిపురపు శ్రీరామ్‌, పొదిలాపు భాష, కోట్ల అప్పలస్వామి, ఆల్తి రోహిణి కుమార్‌, గిడిజాల కృష్ణారెడ్డి బొమ్మలాట తవిటియ్య, ఎఒ ధనుంజయరావు, పంచాయతీ అధికారి ప్రభాకరరావు, వైద్యులు సుమన్‌, కృష్ణచైతన్య, వివిధ శాఖల అధికారులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
్‌నందిగాం: మండలంలో హరిదాసుపురం గ్రామంలో సర్పంచ్‌ కణితి ధనలక్ష్మి నారాయణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన జనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేరాడ తిలక్‌, ఎంపిపి నడుపూరు శ్రీరామమూర్తి, పిఎసిఎస్‌ అధ్యక్షులు కురమాన బాలకృష్ణారావు, మండల వైసిపి అధ్యక్షులు తమిరి ఫాల్గుణరావు, మండల జెసిఎస్‌ కన్వీనర్‌ జడ్యాడ జయరాం, మండల పరిషత్‌ ప్రత్యేక ఆహ్వానితులు చిన్ని జోగారావు యాదవ్‌, ఎంపిటిసి కనితి రామచంద్రుడు, అంబోడి విష్ణు, రోణంకి ధర్మారావు, ఆశ వర్కర్లు అంగన్వాడి కార్యకర్తలు, పంచాయతీ సెక్రెటరీ, వలంటీర్లు, పాల్గొన్నారు.
కవిటి: మండలం వరక పంచాయతీలో శనివారం జరిగిన ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో కడియాల ప్రకాష్‌ పాల్గొన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ శేఖర్‌, ఎంపిడిఒ సూర్యనారాయణ రెడ్డి, సర్పంచ్‌ సావిత్రి పురియా, ఎంపిటిసి పి.కృష్ణారావు, నాయకులు నర్తు శివాజీ, శ్రీకాంత్‌ పురియా, ఎస్‌పి ప్రవీణ్‌, అంగన్వాడీ సూపర్‌ వైజర్లు కృష్ణవేణి, పల్లవి పాల్గొన్నారు.
వజ్రపుకొత్తూరు: పల్లిసారదిలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ ప్రతినిధి వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడు పాలిన శ్రీనివాసరావు, ఎంపిపి ఉప్పరపెల్లి నీలవేణి పాల్గొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బత్తిన కుసుమకుమారి, హేమంత్‌, మండల పరిషత్‌ ప్రత్యేక అహ్వానితుడు ఉప్పరపెల్లి ఉదరు కుమార్‌, మండల సచివాలయ కన్వీనర్‌ వడ్డీ కరుణాకర్‌, ఎంపిడిఒ ఈశ్వరమ్మ, అంగన్వాడి సూపర్‌వైజర్‌ లత, డిటి గిరిరాజ్‌, ఇఒపిఆర్‌డి తిరుమలరావు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
కొత్తూరు: మండలంలో వసప గ్రామంలో శనివారం ఆరోగ్య సురక్ష కార్యక్రమం సర్పంచ్‌ వలురౌతు ఆఫీస్‌రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా కోశాధికారి, పాతపట్నం నియోజకవర్గ నాయకులు లోతుగెడ్డ తులసివర ప్రసాదరావు, కోయిలాపు సంజీవరావు, ఎం.ప్రతాప్‌, అగతముడి నాగేశ్వరావు, కలమట తిరుపతిరావు, ప్రశాంత్‌ కుమార్‌, బూడిద రఘు, వైద్యులు పాల్గొన్నారు.
జలుమూరు: మండలంలోని రావిపాడులో శనివారం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి వాన గోపి, పోలాకి జడ్పిటిసి డాక్టర్‌ ధర్మాన కృష్ణ చైతన్య, జెసిఎస్‌ కన్వీనర్‌ ధర్మాన జగన్మోహనరావు, మండల సలహాదారుడు పైడి విఠల్‌రావు, ఎంపిడిఒ అప్పారావు, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సోంపేట: జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల ద్వారా పేదలకు స్థానికంగానే మెరుగైన వైద్యం అందుతోందని ఎంపిపి డాక్టర్‌ నిమ్మన దాసు అన్నారు. మండలంలోని ఇసుకలపాలెంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపిటిసి ప్రతినిధి తిరుపతి, వైసిఇప జిల్లా కార్యదర్శి బైపల్లి రామారావు, వార్డు మెంబర్లు, వైద్యాధికారులు పాల్గొన్నారు.
కోటబొమ్మాళి: మండలంలో గంగరాంలో ఎంపిపి రోణంకి ఉమామల్లేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి, వైసిపి నాయకులు డాక్టర్‌ కిల్లి కృపారాణి, దువ్వాడ వాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ పేడాడ జోత్న వెంకటరావు, మండల పార్టీ అధ్యక్షుడు నూక సత్యరాజు, రాష్ట్ర కళింగ కార్పోరేషన్‌ డైరెక్టర్‌ సంపతిరావు హేమసుందరరాజు, కవిటి రామరాజు, ఎంపిడిఒ ఫణీంద్రకుమార్‌, డిటి ఆర్‌. మధు, ఇఒపిఆర్‌డి బొడ్డేపల్లి రామారావు, అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
పొందూరు: మండలం కోటిపల్లి గ్రామంలో కింతలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శనివారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ సీపాన హరిహరరావు, ఇఒపిఆర్‌డి సింహాచలం, సర్పంచ్‌ ప్రతినిధి గురుగుబెల్లి అసిరినాయుడు, వైసిపి మండల జెసిఎస్‌ బాడాన వెంకట కృష్ణారావు, వైద్యాధికారులు శివశంకర్‌, జి.రమేష్‌నాయుడు, సిహెచ్‌ఒ వాణీకుమారి, సూపర్‌వైజర్‌ మణిప్రసాద్‌, వైద్య సిబ్బంది, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీకాకుళం: మండలంలోని పెద్దపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా 24 మందికి విద్యార్థుల నేత్రాలను పరీక్షించారు. అవసరమైన వారికి జిల్లా అంధత్వ నివారణ సంస్థ జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ డాక్టర్‌ కె.త్రినాథరావు ఉచిత కళ్లద్దాల పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి హెచ్‌ఎం ఎం.శ్రీనివాసరావు, ఆప్తాలమిక్‌ అధికారులు డి.రాజశేఖర్‌రెడ్డి, కె.ఈశ్వరరావు పాల్గొన్నారు.