
ప్రజాశక్తి- ఆమదాలవలస: జగనన్న సురక్షతో ప్రజల వద్దకే వైద్య సేవలు వస్తున్నాయని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. గురువారం మండలంలోని వంజంగి గ్రామంలో జగనన్న సురక్ష వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వైద్య శిబిరంలో రోగులకు అందుతున్న వైద్య సేవల తీరు తెన్నులను పరిశీలించారు. వైద్య శిబిరంలో ఏర్పాటు చేసిన పలు విభాగాల స్టాల్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఒక్కరు వైద్యానికి దూరం కాకుండా ఉండాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశమన్నారు. అనారోగ్యంతో అధిక డబ్బులు ఖర్చుపెట్టి ప్రజలు ఆర్థికంగా చితికిపోకూడదన్న ఉద్దేశంతోనే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రభుత్వం గ్రామాల్లో నిర్వహిస్తుందన్నారు. ఆరోగ్యకర గ్రామాల కోసం జగనన్న సురక్ష వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అంగన్వాడీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్ఠికాహార స్టాల్‌ను పరిశీలించి శిబిరానికి వచ్చే గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, రక్తహీనతతో బాధపడుతున్న వారికి అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా జగనన్న ఆరోగ్య కిట్లను అందజేశారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి తమ్మినేని శ్రీరామ్మూర్తి, జెడ్‌పిటిసి బెండి గోవిందరావు, ఎంపిడిఒ ఎస్. వాసుదేవరావు, మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, వైద్యాధికారి బాలచందర్, వైద్య, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
నరసన్నపేట: మండలం రావులవలస గ్రామ సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు, నరసన్నపేట శాసనసభ్యులు ధర్మాన కష్ణదాస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఆరంగి మురళీధర్, పొందర కార్పొరేషన్ చైర్మన్ రాజాపు హైమావతి అప్పన్న, డాక్టర్ సెల్ అధ్యక్షుడు ముద్దాడ బాల భూపాల్ నాయుడు, మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు సురంగి నర్సింగరావు, మండలం పార్టీ అధ్యక్షుడు లుకలాపు రవి కుమార్‌తో పాటు మండల వైసిపి నాయకులు, కార్యకర్తలు, వైద్యులు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
నందిగాం: నందిగాం మండలం పెద్ద తామరపల్లి సచివాలయ పరిధిలో సర్పంచ్ ప్రతినిధి తమిరి దేవేంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్, ఎంపిపి నడుపూరు శ్రీరామమూర్తితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ శివప్రసాద్, డిప్యూటీ తహశీల్దార్ ధనలక్ష్మి, ఎంపిటిసి సైలాడ లావన్య, మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితులు చిన్ని జోగారావు యాదవ్, సుభద్రపురం సర్పంచ్ బోరుభద్ర సోమేశ్వరారావు, స్థానిక ఉపసర్పంచ్ టొంప రామారావు, తమరి షణ్ముఖరావు, జీరు లక్ష్మణరావు, రట్టి నాగరాజు సచివాలయ సిబ్బంది, వైద్య సిబ్బంది, వాలంటీర్స్ పాల్గొన్నారు.
మెళియాపుట్టి: మండలంలోని జాడుపల్లి గ్రామంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాల్గొన్నారు. ఐసిడిఎస్ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. గర్భిణీ స్త్రీలకు సీమంతాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ చంద్రకుమారి, డిటి టి. శంకరరావు, ఎంఇఒ ఎం.పద్మనాభం, ఎంపిపి ప్రతినిధి బి.ఉదరు కుమార్, పిఎసిఎస్ అధ్యక్షులు ఉర్లాప బాలరాజు, వైద్యాధికారులు హేమంతలక్ష్మి, పావని, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
వజ్రపుకొత్తూరు: నగరంపల్లిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ ప్రాథమిక పరపతి సంఘం అధ్యక్షులు దువ్వాడ మధుకేశ్వరరావు, వైసిపి నాయకులు శిస్టు గౌతమ్, ఎంపిటిసి ప్రతినిధి బి.మోహనరావు, నీలరావు హరికృష్ణ, ఎంపిడిఒ ఈశ్వరమ్మ, ఇఒపిఆర్‌డి తిరుమలరావు, వైద్యులు దువ్వాడ దివ్య, తానిస్క్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
పలాస: మండలంలో టెక్కలిపట్నంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పిఎసిఎస్ అధ్యక్షులు పైల వెంకటరావు(చిట్టి), ఎంపిపి ప్రతినిధి ఉంగ సాయికృష్ణ, ఎంపిడిఒ రమేష్‌నాయుడు, ఇఒపిఆర్‌డి మెట్ట వైకుంఠరావు, ఐసిడిఎస్ పిఒ డి. శార్వాణి, మండల సచివాలయ కన్వీనరు దువ్వాడ రవికుమార్, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు కొర్ల సంతోష్‌కుమార్ పాల్గొన్నారు. అలాగే పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో తాళభద్ర గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, కమిషనర్ నాగేంద్రకుమార్, ఎఇ అవినాష్, వైసిపి నాయకులు డబ్బీరు నాగ భూషణరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సంత బొమ్మాళి: ఆర్‌హెచ్ పురంలో సర్పంచ్‌లు జోగి రాములమ్మ, ఎన్ని మన్మథరావు ఆధ్వర్యంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, జెడ్‌పిటిసి పాల వసంత రెడ్డి, నందిగాం, కోటబొమ్మాలి ఎంపిపిలు నడుపూరు శ్రీరామమూర్తి, రోనంకి మల్లయ్య, మండల పార్టీ కన్వీనర్ జీరు బాబురావు, చిన్ని జోగారావు యాదవ్, ఎంపిటిసి రాజు, అప్పలనాయుడు, సర్పంచ్‌లు నక్కిట్ల అప్పన్న, భూషణ్ రెడ్డి, వెంకటరావు, నాగభూషణం, మన్మధరావు పాల్గొన్నారు.
పొందూరు: మండలం అచ్చిపోలవలస గ్రామంలో కింతలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన సుమారు 386 మందికి వైద్య పరీక్షలు జరిపి మందులను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ చంద్రమణి, వైసిపి మండల జెసిఎస్ బాడాన వెంకట కృష్ణారావు, ఎంపిడిఒ సీపాన హరిహరరావు, ఇఒపిఆర్‌డి సింహాచలం, వైసిపి నాయకులు శేఖర్, వైద్యాధికారులు శివశంకర్, రమేష్‌నాయుడు, సిహెచ్‌ఒ వాణికుమారి, ఎమ్‌ఎల్‌హెచ్‌పి శృతి, వైద్య సిబ్బంది, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
రణస్థలం రూరల్: మండల కేంద్రం జెఆర్.పురం-2 గ్రామ సచివాలయం పరిధిలో గరికిపాలెం గ్రామంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, మండల ఎంపిపి ప్రతినిధి పిన్నింటి సాయికుమార్, జెడ్‌పిటిసి టొంపల సీతారాం, మండల పార్టీ అధ్యక్షులు మహంతి పెద్దరామునాయుడు, జెసిఎస్ ఇన్‌ఛార్జి చిల్ల వెంకటరెడ్డి, వైస్ ఎంపిపి రాయపురెడ్డి బుజ్జి, వైస్ ఎంపిపి ప్రతినిధి మైలపల్లి కామరాజు, మండల మహిళా అధ్యక్షురాలు గురాన మానస, జెఆర్.పురం సర్పంచ్ భవిరి రమణ, నాయకులు నజ్మాభాను, కరిమజ్జి భూషణ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కవిటి: కవిటి మండలం బల్లిపుట్టుగ గ్రామంలో గురువారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో జెడ్‌పి చైర్‌పర్సన్ విజయ పాల్గొన్నారు. ఐసిడిఎస్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీకన్య దొలై, ఎఎంసి మాజీ వైస్ చైర్మన్ రజనీ కుమార్ దొలై, వజ్జ గోపి, ఎంపిడిఒ సూర్యనారాయణ రెడ్డి, తహసీల్దార్ పి శేఖర్ పాల్గొన్నారు.
కోటబొమ్మాళి: మండలంలో నీలంపేట గ్రామ సచివాలయ పరిధిలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మండల పరిషత్ అద్యక్షుడు రోణంకి ఉమామల్లేశ్వరరావు పాల్గొన్నారు. వైద్యులు డి. నీరజ, మనీష, ప్రీతి, జోత్స్న, సురేష్, నితీష్‌కుమార్‌లు 491 మంది పలు రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అలాగే డిఎంహెచ్‌ఒ బమ్మిడి మీనాక్షి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పరిశీలించి వైద్యులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చి రోగులకు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ కె. ఫణీంద్రకుమార్, డిటి ఆర్.మధు, ఇఒపిఆర్‌డి బొడ్డేపల్లి రామారావు, రాష్ట్ర కళింగ కర్పోరేషన్ డైరెక్టర్ సంపతిరావు హేమసుందరరాజు, సర్పంచ్‌లు శ్రీనివాస్, ఈశ్వరమ్మ, సింహాచలం, ఎంపిటిసి చెంచులు పాల్గొన్నారు.