
ప్రజాశక్తి- లావేరు: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిరణ్‌కుమార్ అన్నారు. పెద్దలింగాలవలసలో శనివారం ఏర్పాటుచేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. వైద్య శిబిరాన్ని పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి ఆర్.బాలకృష్ణ, జెడ్‌పిటిసి సీతంనాయుడు, వైస్ ఎంపిపి లుకలాపు శ్రీనువాసరావు, పిఎసిఎస్ అధ్యక్షుడు బురాడ చిన్నారావు, ఎంపిడిఒ సురేష్‌కుమార్, నాయకులు దేశెట్టి తిరుపతిరావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మెళియాపుట్టి: మండలంలోమర్రిపాడు (కె) గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ పి.చంద్రకుమారి, డిటి శంకరరావు, ఎంఇఒ ఎం.పద్మనాభం, ఎంపిపి ప్రతినిధి బి.ఉదరు కుమార్, పిఎసిఎస్ అధ్యక్షులు ఉర్లన బాలరాజు, మండల వైసిపి కన్వీనర్ పల్లి యోగి, మాజీ జెడ్‌పిటిసి ప్రతినిధి బమ్మిడి ఖగేష్, స్థానిక సర్పంచ్ పైల దివ్య, వైద్యాధికారులు హేమంతలక్ష్మి, పావని పాల్గొన్నారు.
కవిటి: గ్రామంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి కడియాల ప్రకాష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు పూడి లక్ష్మణరావు, ఎఎంసి వైస్ చైర్మన్ యలమంచి నీలయ్య, సర్పంచ్ కాయ దమయంతి, వైసిపి లీగల్ సెల్ కన్వీనర్ పులకల శ్రీరాములు, మత్స్యకార ఎఫ్‌పిఒ అధ్యక్షుడు కాయ భీమసేన్, నాయకులు ఎన్ని అశోక్, పిన్నింటి జయరాం, మామిడి సంతోష్, ఎంపిడిఒ సూర్యనారాయణ రెడ్డి, వైద్యులు శశిధర్, మౌనిక, అభిమన్యు సోయి పాల్గొన్నారు.
టెక్కలి రూరల్ : మండలం తలగాంలో సర్పంచ్‌లు పోలాకి లక్ష్మి, కిల్లి సావిత్రి అధ్వర్యంలో జరిగిన జగనన్న అరోగ్య సురక్ష కార్యక్రమంలో దువ్వాడ వాణి పాల్గొన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపిపి పేడాడ రమేష్, సర్పంచ్ ప్రతినిధులు హనుమంతు వెంకటేశ్వరరావు, పోలాకి చంద్రశేఖర్, ఎంపిడిఒ చింతాడ లక్ష్మీబాయి, ప్రజా ప్రతినిధులు, వైద్యసిబ్బంది, సచివాలయ సిబ్బంది గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
నందిగాం : మండలం రధజనబొడ్డపాడు గ్రామంలో సర్పంచ్ బొడ్డపాటి శశిరేఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్, దువ్వాడ వాణి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ శివప్రసాద్, డిటి ధనలక్ష్మి, వైద్యాధికారులు అనిత, అంజలి, కర్లపూడి సర్పంచ్ తమిరిరాజు, నడిమింటి రామ్మూర్తి పాల్గొన్నారు.
పోలాకి : దండులక్ష్మీపురం పంచాయతీలో జగనన్న ఆరోగ్యసురక్ష కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి ధర్మాన క్రిష్ణ చైతన్య, డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపిపి ప్రతినిధి ముద్దాడ బైరాగి నాయుడు, వైసిపి మండల కన్వీనర్ కణితి కృష్ణారావు, సర్పంచ్ తమ్మినేని వెంకట రత్నం, వైసిపి నాయకులు చింతాడ భీమారావు, చింతు రాఘవ, కణితి సత్తిబాబు, త్రినాథరావు, డిటి శ్రీనివాసరావు, ఎంపిడిఒ ఉషశ్రీ, వైద్యులు శ్రీనాథ్, రత్నంరాజు, చందనం, విస్తరణాధికారి రవికుమార్, రామకృష్ణ పాల్గొన్నారు.
సంతబొమ్మాళి: మేఘవరంలో సర్పంచ్ పరపటి సునీత శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్, జెడ్‌పిటిసి పాల వసంతరెడ్డి, ఎంపిటిసి సూరాడ రాజారావు, జిల్లా మత్స్యకార సహకార సంఘం డైరెక్టర్ సూరాడ జోగారావు, మరువాడ వెసిపి ఇన్‌ఛార్జి గంట ఈశ్వరరావు, సచివాలయం కన్వీనర్‌లు పరపటి రవీంద్రనాథ్ రెడ్డి, గంట కుమార్, వైసిపి నాయకులు పరపటి మేనకేతన రెడ్డి, ఎంపిడిఒ సిహెచ్ ప్రేమలీల, డిటి ప్రవీణ్ కుమార్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి.అవని, కార్యదర్శి కె.విద్యా, సచివాలయం సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు.
వజ్రపుకొత్తూరు: నువ్వులరేవులో నిర్వహించిన జగనన్న ఆరోగ్యసురక్ష కార్యక్రమంలో ఎంపిపి ఉప్పరపల్లి ఉదరు కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎజ్రా, వైస్ సర్పంచ్ దేవా, ఎంపిడిఒ ఈశ్వరమ్మ, డిటి గిరి రాజు, వైద్యులు కనిస్క్, అంగన్వాడీ కార్యకర్తలు ఇందు, చామంతి, సెక్రెటరీ అదిల్ షా, గ్రామరెవెన్యూ అధికారి కొమ్మాన హైమవతి పాల్గొన్నారు.
కోటబొమ్మాళి: మండలం విశ్వనాధపురం గ్రామ సచివాలయ అవరణలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు రోణంకి ఉమా మల్లేశ్వరరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ఫణీంద్రకుమార్, డిటి ఆర్.మధు, ఇఒపిఆర్‌డి బొడ్డేపల్లి రామారావు, రాష్ట్ర కళింగ కర్పోరేషన్ డైరెక్టర్ సంపతిరావు హేమసుందరరరాజు, నాయకుడు పేడాడ వెంకటరావు, దుంగ శిమ్మన్న సర్పంచ్ ప్రభావతి, ఎంపిటిసి దామోదర్, సింహాచలం, నిమ్మయ్య, కమలాకర్, వైద్యులు, ఐసిడిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.