
ప్రజాశక్తి- బూర్జ: సిఎం జగన్మోహన్ రెడ్డి పాలన భారతదేశంలో ఆదర్శమని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. సోమవారం అన్నంపేట గ్రామంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి ప్రభుత్వం అందిస్తున్న పాలనను చూసి భారత దేశంలోని అన్ని రాష్ట్రాలు ముక్కున వేలేసుకున్నాయన్నారు. ఈ సిఎం దేశంలోనే చరిత్ర సష్టించారని, ఎక్కడా కనీవిని ఎరుగని రీతిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించి ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. విద్య, వైద్యానికి పేదరికం అద్దంకి కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలు చేశారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఇంటింటికీ వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ప్రజలు సంక్షేమాన్ని అర్థం చేసుకుని నిజాయితీగల పాలన రక్షించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అనంతరం స్పీకర్‌తో పాటు ప్రజాప్రతినిధులందరూ వైద్య శిబిరాన్ని, అంగన్వాడి టీచర్లు నిర్వహించిన పోషకాహార పదార్థాల ప్రదర్శనను పరిశీలించారు. ప్రముఖ వైద్యులు ప్రియదర్శిని, శ్రీవలి,్ల రమ్య, పైడి సుజాత వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అలాగే కంటి పరీక్షలను ఆప్తాలమిక్ అసిస్టెంట్ ప్రసాదరావు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కర్నేన దీప, జెడ్‌పిటిసి బెజ్జిపురపు రామారావు, టిట్క్కో రాష్ట్ర డైరెక్టర్ కండాపు గోవిందరావు, వైస్ ఎంపిపిలు బుడుమూరు సూర్యారావు, కరణం కృష్ణంనాయుడు, మండల కన్వీనర్ల సంఘం అధ్యక్షుడు, ఎంపిటిసి గుమ్మడి రాంబాబు, సర్పంచ్ ఇప్పిలి అంబజాక్షి పిఎసిఎస్ అధ్యక్షుడు బాగాది నారాయణమూర్తి, ఎంపిడిఒ రవీంద్రబాబు, తహశీల్దార్ ఎస్. రమణారావు, ఇఒపిఆర్‌డి విజయలక్ష్మి, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు సూరపు ఉదరు, వైసిపి నాయకులు కొరికాన శంకరరావు, మామిడి ఆదినారాయణ, మామిడి శ్రీరాములు, కిరణ్ కుమార్, మామిడి శ్రీనివాసరావు, సురేష్ దొర, ఇప్పిలి అప్పలనాయుడు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
వజ్రపుకొత్తూరు : మండలంలోని మంచినీళ్లపేటలో నిర్వహించి జనగన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ఎంపిపి ప్రతినిధి ఉప్పరపల్లి ఉదరుకుమార్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రోగులకు మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపిపి వంక రాజు, తహశీల్దార్ బి.అప్పలస్వామి, ఇఒపిఆర్‌డి దిక్కల తిరుమలరావు, అంగన్వాడీ కార్యకర్త గీత, వజ్రపుకొత్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు విజయకుమార్‌రెడ్డి, జెమ్స్ వైద్యులు వేదాంతరెడ్డి, అఖిల్ పాల్గొన్నారు.
పోలాకి: మండలంలోని కొత్తరేవు సచివాలయం పరిధిలో నిర్వహించిన జగన్న ఆరోగ్య సురక్షలో డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు పాల్గొన్నారు. వైద్యులు శ్రీనాథ్, రత్నంరాజు ఏడు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి ముద్దాడ భైరాగినాయుడు, వైసిపి మండల కన్వీనర్ కణితి కృష్ణారావు, ఎంపిడిఒ ఉషశ్రీ, డిటి పి.శ్రీనివాసరావు, విస్తరణ అధికారి ఎన్.రవికుమార్, ఎంపిహెచ్‌ఒ బి.రామకృష్ణ పాల్గొన్నారు.
కొత్తూరు : స్థానిక ప్రాథమిక పాఠశాల-1లో నిర్వహించిన ఆరోగ్య సురక్ష శిబిరంలో రోగులకు రక్త పరీక్షలు చేశారు. స్థానిక ఐసిడిఎస్ ప్రాజెక్టు పిఒ యు.విమలకుమారి ఆధ్వర్యాన పౌష్టికాహారం ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఇందులో మునగ ఆకుతో తయారు చేసిన పిండి వంటలను చూపరులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో లింగాల శాంతికుమారి, వైద్యులు రాంబాబు, రామకృష్ణ, తేజస్వి, యోగిత, రాజు, సతీష్ పాల్గొన్నారు.
కోటబొమ్మాళి : మండలంలోని హరిశ్చంద్రపురంలో నిర్వహించిన జగన్న ఆరోగ్య సురక్షలో ఎంపిపి రోణంకి ఉమామల్లేశ్వరరావు పాల్గొన్నారు. వైద్యులు 401 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. కార్యక్రమంలో కళింగ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ సంపతిరావు హేమసుందరరాజు, ఎంపిడిఒ కె.ఫణీంద్రకుమార్, డిటి ఆర్.మధు, సర్పంచ్ జి.కేశవ రావు, ఎంఇఒ ఎల్.వి.ప్రతాప్, ఎంపిటిసిలు పాల్గొన్నారు.
పలాస: మండలంలోని లక్ష్మీపురంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్షలో 74 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ఎన్.రమేష్‌నాయుడు, మండల విస్తరణాధికారి మెట్ట వైకుంఠరావు పాల్గొన్నారు.