Oct 12,2023 19:37

ఆరోగ్య సురక్ష కిట్‌ను అందజేస్తున్న దృశ్యం



ఆరోగ్య సురక్ష కిట్‌ను అందజేస్తున్న దృశ్యం
ఆరోగ్య సమస్యలకు పరిష్కారం
ప్రజాశక్తి-సీతారామపురం:ప్రజల ఆరోగ్య సమస్యకు స్థానికంగానే పరిష్కారం చూపడమే జగనన్న ఆరోగ్య సురక్ష ముఖ్య ధ్యేయమని జెడ్‌పిటిసి సభ్యుడు చెరుకుపల్లి రమణారెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని పబ్బు లేటి పల్లి సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిం చడానికి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. పీహె
చ్సీ వైద్యులు సిబ్బందితో వైద్య పరీక్షలు చేయించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రంగ సుబ్బరాయుడు, సర్పంచ్‌ ఆదెయ్య, విద్యాధికారిని స్వప్న, వైసిపి నాయకుడు పోరుమామిళ్ల కాశయ్య పాల్గొన్నారు.