Aug 04,2023 22:17

కార్యక్రమంలో మాట్లాడుతున్న జెవివి నాయకురాలు డాక్టర్‌ ప్రసూన



ఆరోగ్య పరిరక్షణకు విద్యార్థుల్లో చైతన్యం రావాలి
ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌  
విద్యార్థులు చదువుతో పాటు తమ ఆరోగ్యం పరిరక్షణలో చైతన్యం పొందాలని జెవివి నాయకురాలు డాక్టర్‌ ప్రసూన పిలుపునిచ్చారు. శుక్రవారం విద్వాన్‌ విశ్వం విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో భైరవనగర్‌లోని ప్రతిభ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో విద్యార్థులకు ఆరోగ్య సూత్రాలు, పోషక ఆహార విలువలు, విద్యార్థుల వ్యక్తిగత ఎదుగుదలకు కావాల్సిన విషయాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్య సూత్రాలు, పోషక ఆహార విలువలను మన దైనందిత జీవితంలో అలవర్చుకుని, క్రమ శిక్షణతో ఉండాలని వివరించారు. విద్యార్థి దశలో ఇవి చాలా అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో విద్వాన్‌ విశ్వం విజ్ఞాన కేంద్రం సంస్థ కన్వీనర్‌ ఎజి.రాజమోహన్‌, ఎంఎన్‌టి.రాజు, పాఠశాల యాజమాన్యం వీరనారప్ప, కొండా రెడ్డి, అంజన్‌ రెడ్డి, ప్రిన్సిపాల్‌ వాసంతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.