Oct 03,2023 19:27

ఆరోగ్య సేవలపై ఆరా తీస్తున్న మంత్రి

ప్రజాశక్తి -వెంకటాచలం :సంపూర్ణ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి డాక్టర్‌ కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు.వెంకటాచలం మండలం, నిడిగుంటపాలెం జెడ్‌పి హైస్కూల్లో మంగళవారం ఏర్పాటుచేసిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును మంత్రి పరిశీలించారు. తొలుత జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో ఏర్పాటుచేసిన హెల్ప్‌ డెస్క్‌, స్పాట్‌ రిజిస్ట్రేషన్‌, కేస్‌ షీట్‌ కౌంటర్‌, ల్యాబ్‌ టెస్టింగ్‌ కౌంటర్‌, మందుల పంపిణీ కౌంటర్‌ను పరిశీలించిన మంత్రి రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి భద్రత కల్పించాలన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలకు ఆనందం అందించాలనే గొప్ప సంకల్పంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని చెప్పారు. డిఎంహెచ్‌ఒ పెంచలయ్య, డిఎల్డిఒ వసుమతి, ఎంపిడిఒ వెంక టరమేష్‌, పంచాయతీ కార్యదర్శి మంజుల, వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకట శేషయ్య, ఉప ఎంపిపి కోదండరామిరెడ్డి, మండల కన్వీనర్‌ మోహన్‌ నాయుడు, సర్పంచ్‌ అడపాల ఏడుకొండలు పాల్గొన్నారు.