ఇందిర
ప్రజాశక్తి - క్యాంపస్ :
ఈమె అదే విభాగానికి చెందిన విశ్రాంత అధ్యాపకులు ఆచార్య ఎన్. క్రిష్ణా రెడ్డి పర్యవేక్షణలో ''కర్ణాటకలో తెలుగు శాసనాలు : ఒక సాంఘీక, సాంస్కతిక అధ్యయనం'' అనే అంశంపై పరిశోధక గ్రంథాన్ని వర్సిటీకి సమర్పించినందుకు డాక్టరేట్ ను ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ పరిశోధన జర్నల్ లలో అనేక పరిశోధన పత్రాలు ప్రచురించారు. అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని పరిశోధన వ్యాసాలను సమర్పించారు. ఎం.ఇందిరాకు డాక్టరేట్ అవార్డు రావడం పట్ల పలువురు ఆచార్యులు, పరిశోధకులు, బంధు మిత్రుల అభినందనలు తెలిపారు.










