అర్జీలు స్వీకరిస్తున్న జెసి
అర్జీలు పునరావతం కాకుండా పరిష్కారం
ప్రజాశక్తి-నెల్లూరు :జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమానికి ప్రజల నుంచి అందే అర్జీలు మళ్లీ మళ్లీ పునరా వతం కాకుండా సంతప్తికరస్థాయిలో సకాలంలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఆర్. కూర్మ నాథ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జాయిం ట్ కలెక్టర్ ఆర్. కూర్మనాథ్, డిఆర్‌ఓ వెంకట నారా యణమ్మ, డి ఆర్ డి ఎ పి డి సాంబశివారెడ్డి, జెడ్పి సీఈవో చిరంజీవితో కలిసి జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత శాఖల జిల్లా అధికారులు జగనన్న కు చెబుదాం కార్యక్రమంలో వచ్చే అర్జీలపై ప్రత్యేక దష్టి సారించాలని, ఒకసారి వచ్చిన అర్జీ మళ్లీ మళ్లీ రాకుండా సమస్యను పరిష్కరించేలా సత్వరమే చర్యలు తీసుకోవాలని సూచించారు. కొన్ని ప్రభుత్వ శాఖల్లో వచ్చిన అర్జీలే మళ్లీ వస్తున్నా యని అలాంటి అర్జీలపై ప్రత్యేక దష్టి సారించి సంబంధిత అర్జీదారులను పిలిపించి పరిష్కారం చేయగలిగినవి చేయాలని, లేనిపక్షంలో ఎందు వలన పరిష్కారం చేయలేక పోతున్నామో స్పష్టం గా వివరించాలన్నారు. నిర్దిష్ట గడువులోగా అర్జీల పరిష్కారం పై ప్రత్యేక దష్టి సారించాలన్నారు.ఈ కార్యక్రమంలో మెప్మా, ఐసిడిఎస్ పీడీలు రవీంద్ర, హేనా సుజన్, హౌసింగ్ పీడీ నాగరాజు, బీసీ, మైనారిటీ, ఎస్సీ, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు వెంకటయ్య, నిర్మలాదేవి, రమేష్, పరిమళ, సర్వే రికార్డుల ఏడి హనుమాన్ ప్రసాద్, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, డి సి హెచ్ ఎస్ రమేష్ నాథ్, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.










