Mar 24,2023 20:51

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాము ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని కొత్త పూసలమర్రు గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవనానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఒకపక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం దిశగా ముఖ్యమంత్రి పు చేస్తున్నారన్నారు. భీమవరం నియోజకవర్గ పరిధిలోని భీమవరం మండలం, వీరవాసరం మండలాలకు సంబంధించి సుమారు రూ.22 కోట్ల నిధులతో జలజీవన్‌ మిషన్‌ పథకంలో శాశ్వత ప్రాతిపదికన తాగునీటి సౌకర్యం కల్పించేందుకు పనులు చేపట్టినట్లు తెలిపారు. నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించే విధంగా 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయించడమే కాకుండా ఆసుపత్రి నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి జల్లా కొండయ్య, ఎఎంసి ఛైర్మన్‌ కోటిపల్లి బాబు, ఎంపిపి పేరిచర్ల విజయ నరసింహరాజు, జెడ్‌పిటిసి కాండ్రేగుల నరసింహారావు పాల్గొన్నారు.