ప్రజాశక్తి-బొమ్మనహాల్ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత సిఎం జగన్‌కే దక్కుతుందని విప్ కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని దేవగిరిలో సర్పంచి కరూరు కవితమ్మ ఆధ్వర్యంలో గడప గడపకూ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతోపాటు సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేయాలని, ఓ మహిళ అడిగిన ప్రశ్నకు వారు సమాధానం చెబుతూ నగరాల్లో ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేసే ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకుంటే ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందన్నారు. అలాగే కణేకలు, బళ్లారి ప్రధాన రహదారి డబుల్ రోడ్డులో పలు ప్రమాదాలు జరుగుతున్నాయని, స్పీడ్ బ్రేకర్లు వేయించాలని క్రాస్ ప్రజలు కోరారు. ఇందుకు విప్ స్పందిస్తూ వెంటనే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ ఈశ్వర్‌రెడ్డి, నాయకులు కోటేశ్వర్‌రెడ్డి, మండల వ్యవసాయ శాఖ కన్వీనర్ జొంపునాయుడు, రామాంజనేయరెడ్డి, బొమ్మనహాల్ రమేష్, ఫొటో స్టూడియో బసవరాజ్, సచివాలయ ఉద్యోగులు, వైద్యసిబ్బంది, శిశు సంక్షేమ శాఖ, రెవెన్యూ శాఖ, తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న విప్ కాపు రామచంద్రారెడ్డి










