May 28,2023 21:27

సన్మానం పొందిన వాలంటీర్లతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి

          ప్రజాశక్తి-శింగనమల   సిఎం జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో కుల,మత బేధాలు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. ముందుగా సిఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వంలో ప్రజలకు ఏదైనా పనిగానీ, పథకాలుగానీ అందాలంటే జన్మభూమి కమిటీ సభ్యులకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ఇచ్చేవారన్నారు. అదే వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ ఇళ్ల వద్దకే వెళ్లి ఇస్తున్నారన్నారు. ఇది చూసి టిడిపి నాయకులు ఓర్చుకోలేక పోతున్నారన్నారు. దీంతో ప్రభుత్వంపై లేనిపోని అభాండాలు వేస్తున్నారన్నారు. కాగా జగన్‌ చెప్పాడంటే చేస్తాడంతే అన్నాడు. జగనన్న పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం పార్టీ మేనిఫెస్టోలో పొందుపర్చిన నవరత్నాల పథకాలన్నీ 99 శాతం అమలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, ఎంపిపి గంగాదేవి, జెడ్పిటిసి విజరు ప్రతాప్‌రెడ్డి, తహశీల్దార్‌ రమాదేవి, ఎంపిడిఒ కొండన్న, సర్పంచు ఓబులమ్మ, వైసిపి జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు ఈశ్వర్‌రెడ్డి, ఎంపిటిసిలు, సర్పంచులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.